– న్యాయసంహితలో సెక్షన్ 104(2) రద్దు చేయాలి
– టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దినం జయప్రదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భారతీయ న్యాయ సంహిత్ చట్టంలో సెక్షన్ 104(2)ను రద్దు చేసి డ్రైవర్లకు రక్షణ కల్పించాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) డిమాండ్ చేసింది. ఎస్‌డబ్ల్యూఎఫ్ పిలుపు మేరకు శనివారం టీఎస్‌ఆర్టీసీ పరిధిలోని అన్ని డిపోలు, యూనిట్లలో ఆర్టీసీ కార్మికులు డిమాండ్ బ్యాడ్జీలు ధరించి, నిరసన దినం పాటించారు. రవాణారంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి చట్టంలో మార్పులు చేయాలనీ, లేకుంటే దేశవ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భోజన విరామ సమయ ంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినా దాలు చేశారు. ఎక్కడికక్కడ ఫెడరేషన్ స్థానిక నాయకత్వం కార్మికులను కదిలిస్తూ, నిరసన దినం ఆవశ్యకతను వారికి వివరించే ప్రయత్నం చేసింది. రవాణారంగ కార్మికుల సమస్యలు రాజకీయ అజెండా అయ్యేలా ఆందోళనలు, పోరాటాలు నిర్వ హించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బస్ భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆలిం డియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టీడబ్ల్యూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ఏవీ రావు, గంగాధర్, బిక్షపతి గౌడ్ నాయకత్వం వహించారు. ఖమ్మం రీజియన్‌లో వెంకటేశ్వర్లు, పద్మావతి, వరంగల్ రీజి యన్‌లో ఎల్లయ్య, ఆదిలాబాద్‌లో ఎమ్‌బీ రావు, నల్గొండలో సుధాకర్, హైదరాబాద్ డిపోల్లో ఎస్ కృష్ణ, ప్రకాష్, గీత నాయకత్వం వహించారు. మహ బూబ్‌నగర్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాం జనేయులు, కరీంనగర్‌లో శ్రీనివాస్ నాయకత్వం వహించారు. సంస్థలోని ఇతర కార్మిక సంఘాలు కూడా ఈ సమస్యపై ఉమ్మడి పోరాటానికి కలిసి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన కార్మికులందరికీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.