నవతెలంగాణ-ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని జప్తి సదగోడు గ్రామంలో రోజు రోజుకు వేట కుక్కల బెడద ఎక్కువైతుంది.మేకలను,లేగ దూడలను,బర్రె దూడలను చంపుకతింటున్నాయి. ఇప్పటికే ఐదు మంది రైతులకు చెందిన లేగ దూడలను గాయపరిచి మరికొన్ని వాటిని చంపుకతిన్నాయి అదే తరుణంలో శుక్రవారం అంకురి రాములుకు చెందిన 10 వేల విలువైన మేకను పేగులు బయటకు తీసి తిన్నాయి.కోళ్ల ఫారం వద్ద చనిపోయిన కోళ్లను తినే అలవాటు పడ్డ వేట కుక్కలు ప్రస్తుతం కోళ్లు లేకపోవడంతో లేగ దూడలను వేటాడుతున్నాయని వీటిని ఎలాగైనా కట్టడి చెయ్యాలని అలాంటి ప్రమాదకరమైన కుక్కలను లేకుండా చెయ్యాలని రైతులు వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి వేటకుక్కల బెడద లేకుండా విముక్తి కల్పించాలన్నారు.అలాగే వదిలేస్తే చిన్న పిల్లల ప్రాణాలకే ప్రమాదమని వేడుకుంటున్నారు.