నవతెలంగాణ-ధర్మసాగర్ : మట్టి మాఫియా నుండి రక్షణ కల్పించాలని మలకపల్లి గ్రామానికి చెందిన భీమ్ రెడ్డి రాహుల్ తేజ రెడ్డి స్థానిక పోలీసులను, మైనింగ్ అధికారులను, విజిలెన్స్ అధికారులను కోరారు.సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న కట్కూరి సుధాకర్, వారు కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలక్పల్లి గ్రామానికి చెందిన కట్కూరి సుధాకర్ వారి కుమారులు సర్వే నంబర్ 246లో వారి సొంత భూమిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తూ, దాని ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 244 లోగల మాకు సంబంధించిన మా వ్యవసాయ భూమిలో రాత్రికి రాత్రి దొంగతనంగా మట్టిని తీస్తూ ఇదేంటండి ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.ఈ విషయంలో శనివారం రాత్రి ఇలాగే అక్రమంగా తరలిస్తుండగా 100 కు డయల్ చేయగా హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు రేడ్ హ్యాండెడ్ గా అక్కడున్న 7 లారీ తిప్పర్లను, 1 జెసిబిని పట్టుకొని ఎందుకు సంబంధించిన డ్రైవర్ల ఓనర్ల ను విచారించడం జరిగిందని, మరికొన్ని లారీ టిప్పర్లు తప్పించుకోవడం జరిగిందని తెలిపారు.ఇదే క్రమంలో మైనింగ్ అధికారులకు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా నేడు సంఘటన స్థలాన్ని చేరుకొని వాటిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మా భూమిలో అస్తవ్యస్తంగా మట్టిని తీస్తూ మాకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్న వీరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మాకు రక్షణ మాకు మా కుటుంబాలకు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు, మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసుకొని చట్టపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.