అక్రమదారుల నుండి ప్రభుత్వ భూమి కాపాడండి 

– పంచాయితీ కార్యదర్శికి పిర్యాదు 
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామంలోని సర్వే నంబర్ 321 యందు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సుమారు 7 ఏకరాల భూమిలో గ్రామంలోని కొందరు అక్రమదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి సమాయత్తమవుతున్నారని ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు అధికారులను విజ్ఞప్తి చేశారు.మంగళవారం గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే ప్రక్రియను నిలిపివేయాలని పంచాయతీ కార్యదర్శి లావణ్యకు పలువురు గ్రామస్తులు పిర్యాదు చేశారు. తప్పుడు దృవపత్రాలతో ప్రభుత్వ భూమిని అక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టడానకి కొందరు గ్రామస్తులు యత్నిస్తున్నారని జిల్లాధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టి భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.