లౌకిక విలువలు కాపాడండి

లౌకిక విలువలు కాపాడండి– ప్రజలకు కేరళ సీఎం పినరయి విజ్ఞప్తి
– జాతిపితకు ఘన నివాళి
తిరువనంతపురం : జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మంగళవారం ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. గతంలో కంటే ఇప్పుడు శాంతిని, సామరస్యాన్ని కాపాడడం ఎంతో కీలకంగా మారాయని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ‘దేశంలో లౌకిక విలువలను కాలరాసేందుకు మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. విభజనకు వ్యతిరేకంగా గాంధీ చేసిన హెచ్చరికలను మనం ఇప్పుడు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం కోసం సంఘటితంగా నిలవాలి. మహాత్మా గాంధీ ప్రాణాలను హరించిన మతోన్మాద శక్తుల కబంధ హస్తాల నుండి లౌకిక సామాజిక విలువలను కాపాడతామని మనమంతా ప్రతిజ్ఞ చేయాలి’ అని పినరయి కోరారు.