– చెట్లతోనే మానవుని మనుగడ
– అడవులను నరికివేయడం వల్ల జీవరాసులకు నష్టం
– ప్రగతి సుధామాలో నాటిన 450 ఔషధ మొక్కలు
– శంకర్‌పల్లిలో లక్షా మొక్కలు నాటుతాం
– ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
– జీబీకే రావు
నవతెలంగాణ-శంకర్పల్లి
మొక్కలు నాటి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రగతి సుధామ సీఎండీ జీబీకే రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం శంకర్పల్లి మండలంలోని ప్రగతి సుధామాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అడవులను నరికి వేయడం వల్ల ఎన్నో జీవరాసులు నష్ట పోతున్నాయని అన్నారు. ప్రగతి సుధామాలో 450 ఔషధ మొక్కలు ఉన్నాయనీ, వాటి గాలి మనం పీల్చుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కల్పవృక్షాలు ఏడు రకాలుగా ఉంటాయనీ, అవి మన ఇంటి ఆవరణలో కూడా కనీసం ఒక మొక్కను నాటుకోవచ్చని సూచించారు. నర్సరీనీ మొక్కలని కాపాడడానికి ప్రగతి సుధామాలు రామారావు అనే వ్యక్తిని నియమించినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రగతి సుధామలో లక్షా మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. చెట్లు నాటడం వల్ల రాబోయే తరాల మానవులు ఆరోగ్యంగా ఉండడానికి ఆదర్శంగా నిలుస్తా యన్నారు. పంచభూతాలు సమతుల్యంగా ఉంటే సమస్త జీవరాసులు ముందుకు సాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సుధామ ఎండి అజయ్‌కుమార్, డైరెక్టర్ రామకృష్ణ, డాక్టర్ ఎస్పి. రామారావు తదితరులు ఉన్నారు.