
నవతెలంగాణ – డిచ్ పల్లి
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నెలకొల్పిన ప్లాంటేషన్లలో ఉన్న మొక్కలను సంరక్షించారని రహదారి వెంట ఇవన్నీ ప్రదేశంలో భాగంగా నాటిన మొక్కలను పర్యవేక్షిస్తూ రక్షణ కల్పించే విధంగా చూడాలని ఎంపీడీవో అనంత్ రావు అన్నారు.శనివారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాంసాగర్ తండా ను ఆకస్మికంగా సందర్శించారు. ఏందిరా జిఎస్ పథకంలో భాగంగా ప్లాంటేషన్లో 3700 మొక్కల స్థితిగతులను ఏపీఓ ఒడ్డెం పోశెట్టి ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్లాంటేషన్ లో ామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, చింత తో పాటు పూల మొక్కలను పెంచడం జరుగుతుందని వివరించారు. సిర్నాపల్లి నుండి రామ్ సాగర్ తాండవరకు రహదారి కిరువైపులా కొబ్బరి చెట్లు 260 పెట్టడం జరిగిందని నేడు అవి పెద్దదై ఆహ్లాదకరంగా కనబడుతుందన్నారు ఇలాగే ప్రతిచోట ఎవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలు నాటే విధంగా చూడడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు అనంతరం తాండలో ఉన్న ప్రభుత్వ ప్రథమిక పాఠశాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.