
పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాల్గొని మొక్కలు నాటారు. మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. మొక్కలు నాటితే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనీ, కరువు కాటకాలు దూరమై పంటలు పుష్కలంగా పండుతాయి అని అన్నారు. పచ్చదనాన్ని పెంపొందించే విధంగా తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. వర్షాలు పడగానే మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీ పానుగంటి శారదా రమేష్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ సోమిరెడ్డి, ఇన్చార్జి ఎపిఓ శివ, ఫీల్డ్ అసిస్టెంట్ కనకయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.