
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రక్షిత అటవీ భూముల రక్షణకు రేంజర్ ఎం.మురళీ చర్యలు చేపట్టారు.ఈయన నేతృత్వంలో అశ్వారావుపేట బీట్, 295 కంపార్ట్ మెంట్ నెంబర్ లో గల భూమికి బుధవారం బౌండరీ స్ట్రెంచ్ ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతం లో గతంలోనే కొందరి పేదలకు ప్రభుత్వం నివాస గృహాలకు పట్టాలు ఇచ్చి వికలాంగుల కాలనీ గా నామకరణం చేసింది. అయితే ఈ గృహాలకు అనుకుని ఉన్న మరికొంత భూమిని ఆక్రమించుకుని గృహ నిర్మాణాలు చేపట్టడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో లైన్ ఆఫ్ కంట్రోల్ విధానంలో రేంజర్ మురళి యుద్ధప్రాతిపదికన దమ్మపేట,అశ్వారావుపేట రేంజ్ సిబ్బందితో స్ట్రెంచ్ ను తవ్వించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.ఎస్.ఓ లు అరుణ్, సంపత్, రమేష్, శ్రీను లు పాల్గొన్నారు.