
నవతెలంగాణ – సారంగాపూర్
బాలల హక్కులు పరిరక్షణ అందరి బాధ్యత అని బాలల పరిరక్షణ అధికారి సగ్గం. రాజు అన్నారు. సోమవారం మండలంలోని స్వర్ణ ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో బేటి బచావో బేటి పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాలల హక్కులు –వాటి పరిరక్షణపై విద్యార్థులకి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికలు చదువుల్లో ముందంజలో ఉండాలని హితవు పలికారు. విద్యార్థులకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పించారు. తల్లి,తండ్రులను కోల్పోయి ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న పిల్లలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలకి పదవ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి జెండర్ స్పెషలిస్ట్ ఏ. మౌనిక, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ శ్రీదేవి, ప్రధానోపాధ్యాయులు సంగీత రాణి, హెచ్ డబ్ల్యుఓ రాథోడ్ మంగీలాల్ , ఉపాధ్యాయులు శిరీష, ఆశన్న, అనిల్, ప్రభాకర్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.