నవతెలంగాణ – సిరిసిల్ల
పౌర హక్కుల రక్షణ న్యాయవాదుల బాధ్యత అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోర్నాల సంజీవరెడ్డి అన్నారు సిరిసిల్లలోని జిల్లా పోలీస్ ల తీరు పైన నిరసన వ్యకం చేస్తూ, సిరిసిల్ల వేములవాడ న్యాయ వాదులు, గత 13 రోజులు గా కోర్టు విధులు బహిస్కరించడం జరిగింది మంగళవారం నుండి సిరిసిల్ల న్యాయ స్థానం ముందు న్యాయ వాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు,సిరిసిల్ల బార్ అధ్యక్షులు దోర్నాల సంజీవ రెడ్డి, వేములవాడ బార్ అధ్యక్షులు గుడిసె సదానందం లు మాట్లాడుతూ కక్షి దారుల హక్కులు కాపాడటానికి కోర్టు లలో ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించిన ఇంజక్షన్ ను బేఖాతారు చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న వారి పైననే రాజన్న సిరిసిల్ల పోలీస్ లు అక్రమ కేసులు పెడుతున్నారని వారు అన్నారు. దీక్షలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి వెంకట్, న్యాయవాదులు బొంపెల్లి రవీందర్ , కటకం జనార్దన్ ,గుండెల్లి శశంఖం ,కంసాని రాజేష్ ,శుష్మ ,నిషాదు లో పాల్గొన్నారు దీక్ష కు సీనియర్ న్యాయవాదులు వైద్య ఉమాశంకర్, ఎస్ వసంతం, ధర్మేందర్ ,సురేష్,, రమాకాంతరావు ,గోవింద్ భాస్కర్, తిరుమల్ గౌడ్, వేణు, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు సంఘీభావం తెలిపారు.