రాజ్యాంగ పరిరక్షణే అందరి ధ్యేయం కావాలి

Protection of the Constitution should be the aim of allనవతెలంగాణ – జన్నారం
రాజ్యాంగ పరిరక్షణ అందరి ధ్యేయం కావాలని  అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు సిటీమల భరత్ కుమార్ అన్నారు. బుధవారం2 6 నవంబర్ భారత రాజ్యాంగ వారోత్సవాలను  పురస్కరించుకొని నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన రాజ్యాంగ పరిరక్షకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత  బోర్లకుంట ప్రభుదాసును శాలువాతో పూలమాలలతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో ఈ వారం రోజులు రాజ్యాంగ వారోచ్చవాలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో నెహ్రు యువ కేంద్రం సిబ్బంది  మాజీద్, జిల్లా అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మామిడిపల్లి ఇందయ్యా స్నేహ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు, దుమల రమేష్ స్నేహ యూత్ సభ్యులు మరియు అంబేద్కర్ సంఘం నాయకులుప్రవీణ్ దుమల్ల, శివ బచ్చల, పోశం రాహుల్ మామిడిపల్లి, రాజానర్సు, ఐలవేణి శ్రీనివాస్ పాల్గొన్నారు.