నవతెలంగాణ – జన్నారం
రాజ్యాంగ పరిరక్షణ అందరి ధ్యేయం కావాలని,సుప్రీంకోర్టు అడ్వకేట్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఆర్టియు భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకుడు గవ్వల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాజ్యాంగ రక్షణ సదస్సు లో పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాయడానికి పడిన కష్టాలు ఎస్సి ఎస్టీ బిసి ల తో పాటు మహిళలకు కావాల్సిన చట్టాలు రాజీ లేకుండ రాయబడినవనీ, కొన్నిటిని తొలగించాలన్న తొలగించడం జరగదు ఆని కరాఖండిగా చెప్పిన నేత డాక్టర్ బి అర్ అంబేద్కర్ ఆని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలు,విధులు తప్పకుండా పాటించాలన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తోపాటు, ఎస్సి ఎస్టీ అడ్వకేట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర్ల రమేష్ నాయకులు జక్కుల సురేష్ సీపీఎం మండల కార్యదర్శి కనికరం అశోక్ నేతకాని మహార్ కుల సంఘం మండల అధ్యక్షులు రత్నం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి జాడి సుధాకర్ రాష్ట్ర నాయకులు దుర్గం అమృత రావు హెచ్ ఎం శివరాజం హిందీ పండిత్ రాథోడ్ పిరాజీ లెక్చరర్ లు కరుణాకర్ సాయికుమార్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.