ప్రేమికుల స్వేచ్ఛకు రక్షణేది..!?

ప్రేమికుల స్వేచ్ఛకు రక్షణేది..!?ప్రేమంటే..నిస్వార్థంగా
హృదయాన్నైనా,
కానుకనైనా ఇవ్వడమే..
అనిర్వచనీయమైన,అనంతమైన
గొప్ప భావనైన ప్రేమను
ఆకర్షణల, వాంఛల స్థాయికి దిగజార్చారు..
ప్రేమకు ఉత్సవం చేస్తూనే..
నేను ప్రేమిస్తున్నా.. నన్ను ప్రేమించు!
కాదంటే?ప్రేమను హతమార్చే ఉన్మాదం..!
ప్రేమలన్నీ ఇలానే ఉన్నా(ఉంటా)యని కాదు?
ఆస్తిపాస్తులు,కులమతాలు
వయస్సు,ప్రాంతాలకు అతీతంగా
ఎన్నో ప్రేమ జంటలు
అన్యోన్యంగా సహజీవనం చేస్తున్నారు
స్వల్ప విఫల ప్రేమల సాకుతో
అసలు ప్రేమలను,స్వచ్ఛమైన ప్రేమికుల స్వేచ్ఛను
ధర్మం, ఆధిపత్యం పేరుతో
ఎప్పుడైనా ఎక్కడైనా అడ్డుకోరాదు!?..
నేటి యువతీ, యువత విశ్వజనీన
ప్రేమను పంచుకోండి..
ప్రేమ అమరం.. ప్రేమికులు అజరామరం..
– మేదాజీ (మేకిరి దామోదర్‌)