కార్మిక  చట్టాలపై  బిజెపి దాడులపై నిరసన..

– ఈనెల 16వ తేదీన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి
– దాసరి పాండు  సిఐటియు జిల్లా అధ్యక్షులు..
నవతెలంగాణ  – భువనగిరి
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు అఖిలపక్ష   సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త  సమ్మె ను జయప్రదం చేయాలని సి ఐ టి యు  జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అన్నారు. గురువారం   ఐసిడిఎస్ ప్రాజెక్టు పిడి గారికి  పీడీ గారికి సమ్మె నోటీసు ఇచ్చి  భువనగిరి పట్టణం లో ఉన్న  ఐసిడిఎస్ కార్యాలయం వద్ద వర్కర్స్ సెక్టార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో ఉన్న కార్పొరేట్ శక్తులకు అంబానీ ఆదానికి దేశ సంపదను కుదువబెట్టి ప్రభుత్వ స్కీములుగా ఉన్న ఐసిడిఎస్ ను ఇతర స్కీం లను రద్దు చేయడానికి  చూస్తుందన్నారు. ఇప్పటికే బడ్జెట్లో కోత పెట్టిందని ఐసిడిఎస్ సంస్థలో స్కీం లో దేశంలో ఉన్న అనేకమంది పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. దీనితోపాటు పని చేస్తున్న అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ ను అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పై అదనపు భారాలు మోపుతూ లేక నూతన జీవోలు తీసుకొస్తూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నదన్నారు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఇతర కార్మిక వర్గం పాల్గొనాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాకుమారి నాయకులు పద్మ శామల సత్యలక్ష్మి సరోజ ధనమ్మ పాల్గొన్నారు.