నవతెలంగాణ – కామారెడ్డి
ఎస్సీ వర్గీకరణపై మాట తప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ ఈనెల తొమ్మిదిన తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగాడు లక్ష్మి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో భారీ ప్రదర్శన, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ ఎఫ్, ఎంఎస్పి, ఎంఎంఎస్ నాయకులు తరలి రావలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు, జిల్లా సీనియర్ నాయకులు గరుగళ్ళ బాలరాజు, బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ జి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.