రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి జరిగిన అన్యాయం పై నిరసన..

Protest against the injustice done to Telangana University in the state budget.నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణ యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో జరిగినటువంటి అన్యాయంపై భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లే కార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పేరు మీద ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అని, ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో యూనివర్సిటీ అభివృద్ధికి ఎటువంటి నీదులు కేటాయించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వంలో యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోలేదని అనాడు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడినట్లు వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చాలా సందర్భాల్లో విమర్శించరని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో యూనివర్సిటీకి ఎందుకు మొండి చేయి చూపెట్టిందని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం కేటాయించిన డబ్బులు జీతాలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీకి వీసీ, అధ్యాపకులు లేక యూనివర్సిటీ విద్యా వెనుకబడుతుందని, ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించి యూనివర్సిటీలో ఒక ఇంజనీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగడం సాయి, తరుణ్, సంజయ్, శ్రీకాంత్, రియాజ్, హజారుద్దీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.