
వికారాబాద్ జిల్లా కలెక్టర్ , రెవెన్యూ ఉద్యోగులపై జరిగిన దాడినీ నిరసిస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టి జి ఓ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సి జగన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ దాడిని హేయమైన చర్యగా పరిగణిస్తూ, దాడి జరిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీకాంత్, కలెక్టరు కార్యాలయ పర్యవేక్షకులు రామారావు, సైదులు , జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి, శ్యామేల్ , జిల్లా బి. సి. వెల్ఫేర్ అధికారి, యాదయ్య , అసిస్టెంట్ ట్రేజరీ అధికారి మోహన్ కుమార్ , ఐసిడిఎస్ పర్యవేక్షకులు సోమేష్ , ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.