
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె టైం లో బతుకమ్మ ఆడి కార్మికులు తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ కార్మికులు తమ చాలీచాలని వేతనాలతో బ్రతకలేమని తమ ఆకలి మంటలతో నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు వెళ్లకుండా గ్రామపంచాయతీ కార్మిక జేఏసీని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు కామేశ్వరరావు,అప్పన్న,రాజపుత్ర రంజిత్ సింగ్( నందు), విజయ్,మహేష్ ,భూషణం, బుజ్జమ్మ ,దీనమ్మ ,రాణమ్మ ,రూపమ్మ, తిరుపతమ్మ, లక్ష్మి ,నాగమణి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.