నవతెలంగాణ-ముధోల్: నిర్మల్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ నుండి ఆష్ట వెళ్లే రోడ్డు గుంతలు మయంగా మారడంతో గురువారం స్థానిక యువకులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన వ్యక్తపరిచారు. రోడ్డు పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ఈ రోడ్డు గుంతల మాయంగా మారి ఈ వర్షంతో భారీ స్థాయిలో నీళ్లు నిలిచి ఉంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు గురించి నాయకులు, అదికారులు పట్టించుకోవటం లేదని వారు ఆరోపించారు.ఇకనైనా సంబంధింత అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని వారు కోరారు.