పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం బీజేపీ ఓబిసి ఆధ్వర్యంలో నిరసన తెలిపినారు ఈ సందర్భంగా ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీని నెరవేర్చాలని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ లు డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్ హామీని అమలు చేయాలని, బీసీలకు న్యాయం చేయాలని కోరినారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జెస్సు అనిల్ కుమార్, పెర్కిట్ దుగ్గి విజయ్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.