– ఏఈఓ కు వినతిపత్రం
నవతెలంగాణ – ఏర్గట్ల
రైతు రుణమాఫీపై ఏర్గట్ల మండల కేంద్రంలో నిరసన జ్వాలలు పెల్లుబిక్కాయి.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు బస్టాండ్ సమీపంలోని స్థూపం ఎదుట కూర్చొని ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఏకకాలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు.అలాగే ఈ నెల 24 న చలో ఆర్మూర్ లో భాగంగా మామిడిపల్లి లోని శ్రీసాయి గార్డెన్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరపున నిర్వహించబోయే రైతు సమావేశానికి కుటుంబానికి ఇద్దరు చొప్పున(భార్య,భర్త) హాజరు కావాలని అనుకుంటున్నామని తెలిపారు.ఒకవేళ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీయెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు.వ్యవసాయ విస్తీర్ణాధికారి(ఏఈఓ)మనీషా ధర్నా జరిగే ప్రదేశానికి రావడంతో ఆమెకు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు.అనంతరం ఏఈఓ మనీషా రైతులనుద్దేశించి మాట్లాడుతూ…ఇప్పటి దాకా ఏ రైతుకు రుణమాఫీ కాలేదో వారి వివరాలను మాకు అందజేయాలని,ప్రభుత్వం మాకు ఒక సైట్ ను కేటాయించిందని,వారి వివరాలను అందులో పొందుపరుస్తామని అన్నారు.మాకు ఉన్న సమాచారం ప్రకారం, సాంకేతిక కారణాలతో,రేషన్ కార్డు,పట్టా పాస్ బుక్ లేనివారికి రుణమాఫీ ఆగినట్లుగా తెలిసిందని,రుణమాఫీ కానీ రైతులు వారి వివరాలతో కూడిన జిరాక్స్ లను అందజేయాలని,మీ పేరుపై రిఫ్రెన్స్ ఐడి ఇచ్చి,బుక్ లో రాసుకుని పైకి పంపిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని,అర్హులైన రైతులకు కచ్చితంగా రుణమాఫీ అవుతుందని సర్ది చెప్పడంతో అక్కడ గొడవ సద్దుమణిగింది.ఎస్సై బి.రాము ధర్నా జరిగే ప్రదేశానికి వచ్చి రైతులు సంయమనం పాటించాలని మీ సమస్య పరిష్కారమవుతుందని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ఉపేంధర్ రెడ్డి,బర్మ చిన్న నర్సయ్య,బద్దం ప్రభాకర్, బద్దం హన్మాండ్లు,కొలిప్యాక శ్రీనివాస్ రెడ్డి, పోతుకూరి మహేష్, కూశ లింబాద్రి,నాగిరెడ్డి రాజశేఖర్,నెరేళ్ళ నరేంధర్,మారు మహిపాల్,దొబ్బల రాజేష్,మారు నరేష్,దేవుడు నర్సయ్య,ఈరపట్నం నరేష్,కొమ్ముల రత్న,తదితరులు పాల్గొన్నారు.