గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలని నిరసన

నవతెలంగాణ – నవీపేట్: గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టకుండా నూతన నియామకాలు చేపట్టడాన్ని నిరసిస్తూ నవీపేట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ఉపాధ్యాయులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఫ్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వకుండా ఫిబ్రవరి 14 వ తేదీన నియామక ఉత్తర్వులు ఇవ్వడం వలన పదివేల మంది ఉపాధ్యాయులు జీవితాలు నష్టపోతారని జీవో 317 సమస్యకు పరిష్కార మార్గదర్శకాలు ఇవ్వాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.