కవిత అరెస్టుపై భువనగిరి లో నిరసన

నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి పట్టణము లో ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం అక్రమంగా  ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత అరెస్టుపై  శనివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కవితను అరెస్టు చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలను దృష్టి మరల్చడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తాడని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్లకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి , ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ , జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్ లు మాట్లాడుతూ..బీజేపీ కాంగ్రెస్లో ఈ రాష్ట్రంలో కుమ్ముక్కయి పనిచేస్తున్నాయని విమర్శించారు.  ఈ కార్యక్రమంలో   మాజీ మున్సిపల్ చైర్మన్ ఎండబోయిన ఆంజనేయులు ,జడ్పీటీసీ బీరు మల్లయ్య , హరిశంకర్ ,పట్టణ మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ , జనగాం పాండు , తుమ్మల వెంకటరెడ్డి, రాచమల్ల శ్రీనివాస్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్ దిడ్డి కాడి భగత్, నాయకులు మొగుల శ్రీనివాస్, ఎట్టబోయిన గోపాల్ , సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, మమత, మిర్యాల శ్రీనివాస్, సందెల సుధాకర్, నక్కల చిరంజీవి, సుభాష్, సూరజ్, అజయ్ పాల్గొన్నారు.