నవతెలంగాణ – కంఠేశ్వర్
జులై 15 న ఉదయం 10.30 గంటలనుండి నిజామాబాద్ పాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అపరిష్కృత డిమాండ్ల పరిష్కారం గురించి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ( JAC ) ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించటం జరుగుతుంది అని జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు ఆదివారం ప్రకటనలో తెలియజేశారు. ధర్నా కు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు. పెండింగులో యున్న 4 డి ఏ / డి ఆర్ల ను వెంటనే ప్రకటించాలి. 5 వ డి ఎ/ డి ఆర్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే అది కూడా ప్రకటించాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం ఈ హెచ్ స్ అన్ని కార్పోరేట్ హాస్పిటల్స్ లలో గరిష్ఠ పరిమితి లేని నాణ్యమైన ఉచిత వైద్యచికిత్సలు అందించాలి. ప్రతి జిల్లాలో 2 వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత టెస్టులు, ఉచిత మందుల పంపిణీ చేస్తూ నాణ్యమైన వైద్యం అందించాలి. గత ప్రభుత్వం యిచ్చిన 5% ఐ ఆర్ ను 20% కు పెంచాలి. పి ఆర్ సి రిపోర్టును వెంటనే తెప్పించుకుని 1-7-2023 నుండి మానిటరీ బెనిఫిట్ చెల్లిస్తూ అమలు చేయాలి. ఈ కుబేర్ లో పెండింగ్ లో యున్న మెడికల్ రీ ఎంబర్స్ మెంట్ బిల్లులు యితర బిల్లులు వెంట వెంటనే చెల్లించాలి. గత పి ఆర్ సి బిస్వాల్ కమీషన్ రికమండ్ చేసిన 20 సంవత్సరాల సర్వీసుకు ఫుల్ పెన్షన్ 1-7-2018 నుండి వర్తింప జేయాలి. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు యిచ్చి పెన్షనరీ బెనిఫిట్స్ కు అనుమతించాలి. సివిపి రెస్టోర్ 15 సంవత్సరాలు కాకుండా 12 సంవత్సరాలు పూర్తి కాగానే రెస్టోర్ చెయ్యాలి. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పెన్షనర్లు కూడా పాల్గొన్నారు. పెన్షనర్లకు తెలంగాణా ప్రత్యేక ఇంసెంటివ్ ప్రకటించాలి.పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి అని గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్మోహన్, జిల్లా కోశాధికారి ఈవీఎల్ నారాయణ తెలిపారు.