గుండాల మండలం సీతారాంపురం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేష్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం డిఆర్డిఓ కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బబ్బురి శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి జీతాలు లేనప్పటికీ పై అధికారుల మౌఖిక ఆదేశాల మేరకు ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా గ్రామాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారంటీల సర్వేలు నిర్వహించిస్తున్నపటికీ రాజకీయ నాయకులు కోంత మంది పనికట్టుకోనీ సస్పెన్షన్ చేయించడంఎంత వరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో లబ్ధిదారుల అర్జిమేరకు సర్వే నిర్వహించడం జరిగింది తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దిరాజ్, జిల్లా జనరల్ సెక్రెటరీ బైరగోని రమేష్, కోశాధికారి జేరిపోతుల ఉపేందర్, ఉపాధ్యక్షులు బిచ్చు నాయక్, జిల్లా కార్యదర్శి గుర్రం సురేష్ , వివిధ మండలాల అధ్యక్షులు రవీందర్, రామస్వామి, వెంకటేష్ లు పాల్గొన్నారు.