
పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో వైద్య విద్యార్థినిపై ఆత్యాచారం చేసి హత్య చేసిన కామాంధులను శిక్షించాలని కోరుతూ నవీపేట్ వైద్యులు, వైద్య సిబ్బంది శనివారం ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపాడే చేతులను రక్షించుకొనే బాధ్యత అందరిపై ఉందని ఇటువంటి కామాంధులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటివే పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.