నవతెలంగాణ – తొగుట
ఎన్నికల్లో హామీల వర్షం కురుపించిన సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసాడని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. శనివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలిపిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొ ట్టినందుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కల్వకుంట్ల తారకరామారావు, దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపు మేరకు ఆదివారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. తాము అధికారం లోకి రాగానే ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి, నేడు వానాకాలం పంట పూర్తి అయినా ఇవ్వలేరని ఆరో పించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత యాసంగిలో ఇస్తామని మాట్లాడటం రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు భరోసా లేదని, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరుకు వ్యతి రేకిస్తూ రైతు లతో కలిసి నిరసన కార్యక్రమం చేపడుతామ న్నారు. ఈ నిరసన కార్యక్రమం కు రుణమాఫీ కాని రైతులు స్వచ్చందంగా తరలి వొచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.