రైల్వే బైపాస్ మాకు వద్దంటూ నిరసన ర్యాలీ

Protest rally saying we don't want railway bypassనవతెలంగాణ – ధర్మసాగర్ 
రైల్వే బైపాస్ మాకు వద్దంటూ ప్లే కార్డులతో నిరసన ర్యాలీని చేపట్టిన చిన్న సన్న కారు రైతులు.మండల కేంద్రంలో శుక్రవారం గిద్దే నరసింహారెడ్డి మిల్లు వద్దనుండి బస్టాండ్ ఆవరణ వరకు ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ప్లే కార్డులతో రైల్వే బైపాస్ వద్దంటూ నినాదాలు చేస్తూ నిరసన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్కల్ నుండి హాసన్ పర్తి వరకు రైల్వే బై-పాస్ లైన్ కొత్తగా ప్రతిపాధించిన విషయం పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం నుండి రైల్వే బై-పాస్ లైన్ రావడం గ్రామం స్మశాన వాటిక లాగా మారే అవకాశం ఉందని హితవు పలికారు. అంతేకాకుండ గ్రామ అభివృద్ధి కుంటుపడి దెబ్బ తింటుందని చెప్పారు.చిన్న సన్నాకారు రైతులు ఆర్ధికంగా దెబ్బ తింటారనే ఆలోచనతో రైల్వే లైన్ ప్రతిపాధన పై పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ గూడ్స్ రైల్వే ట్రాక్ వల్ల మన ధర్మసాగర్ చుట్టూ ఉన్న పది గ్రామాలు అన్ని దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ధర్మసాగర్ ముందుకెళ్లి పోవడం వల్ల మరింత నష్టపోయా అవకాశం ఉందని, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆందోళన చేశారు. ఇది మొదటగా ఓఆర్ఆర్ రోడ్డు పక్క నుండి ఉన్న ప్రతిపాదనను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి, మరి గ్రామం మధ్య నుండి తీసుకుపోవడం సరి కాదని,అమలు చేయాలని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న ప్రాంతాన్ని స్మశానంగా మార్చే ఈ బైపాస్ రైల్వే మార్గాన్ని నిర్మించడం పునర్ ఆలోచన చేయాలని ప్రభుత్వానికి ఈ నిరసనగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గుర్రపు ప్రసాద్, రేమిడి మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి, దుర్గయ్య, కొలిపాక రమేష్, చిన్న సన్నకారు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.