పీఎస్‌లో డెంగ్యూ, టైఫాయిడ్‌ టెస్టులు హాస్పిట్‌లో లేవని నిరసన

నవతెలంగాణ-గరిడేపల్లి
మండలకేంద్రంలోని పీఎస్‌లో డెంగ్యూ, టైపాయిడ్‌ టెస్టులు లేవని, దీంతో రోగులు ప్రయివేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి యాకూబ్‌ అన్నారు.ఈవిషయమై గురువారం పీఎస్‌ ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు.హాస్టల్‌ వ్యాప్తంగా వైరల్‌ ఫీవర్‌తో ప్రజలు ఇబ్బంది పడుతూ డెంగూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి అనేక రోగాలతో ప్రజలు ఇబ్బందులు పడతున్నారని,వారిని పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా సెంటర్‌ నుంచి కెమికల్‌ ఒక వ్యక్తి తీసుకొస్తే మళ్లీ వారానికి రిపోర్టు వస్తాయని, ఇది సరికాదన్నారు.10 నిమిషాలలో రిబ్రుట్స్‌ ఇస్తుంటే ప్రభుత్వం హాస్పటల్‌లో వారానికి ఒకసారి ఇవ్వడం మూలాన ప్రజలు అనేక ఇబ్బందులు పడతున్నారని తెలిపారు. పల్లె దవాఖానాలో ఉచితంగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని మాయ మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితులో లేరన్నారు. వెంటనే పీఎస్‌ఎల్‌లో డెంగ్యూ, టైఫాయిడ్‌ కు సంబంధించిన కెమికల్స్‌ని వెంటనే రిపోర్టు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.కనీసం జనరేటర్‌ లేకపోవడంతో రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారన్నారు24 గంటలు స్టాప్‌ నర్సులు, ఏఎన్‌ఎమ్‌లు, వాచ్‌మెన్‌లు ఉండేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్‌, ఎస్‌కె హుస్సేన్‌బి. వెంకయ్య, నాగమ్మ, సైదమ్మ, లక్ష్బీరాములునాయక్‌, జగదీష్‌నాయక్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.