ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి నిరసన సెగ

– హామీల అమలు విఫలంపై ఫ్లెక్సీ
ఆర్మూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగాసముద్ర గ్రామంలో పర్యటిం చగా.. ఫ్లెక్స్‌ రూపంలో గ్రామస్తులు నిరసన తెలియజేశారు. రైతులకు రుణమాఫీ ఎక్కడీ మా ఊరిలో దళితులు లేరా.. దళితబంధు ఎక్కడీ పేద కుటుంబాలకు ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ప్రొసీడింగ్‌ యాడికి పోయారు, మన ఊరు మన బడి అంటివి ఎక్కడ, డ్రైనేజీ, సీసీ రోడ్లు ఎక్కడా?.. ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇక చేయరు” అని గంగాసముద్ర గ్రామస్తులు ఫ్లెక్సీ కట్టారు. ఎన్నికలు వస్తేనే మా గ్రామం మీకు గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గో బ్యాక్‌’ ఎమ్మెల్యే అంటూ నిరసన తెలియజేశారు.