– ఇథనాల్ పరిశ్రమపై గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు
నవతెలంగాణ – బెజ్జంకి
పోలీసుశాఖ అండతో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించాలని యాజమాన్యం వ్యవహరిస్తోందని, ప్రభుత్వం సత్వరమే ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ పనుల అనుమతులను రద్దు చేయాలని గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు పురుగుల మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ శివారులో నిర్వహించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ స్థలం వద్ద అనుమతులను రద్దు చేయాలంటూ అయా గ్రామాల గ్రామస్తులు అందోళన వ్యక్తం చేశారు.ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం పోలీసులను మభ్యపెట్టి గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తుందని, ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని గుగ్గీల్ల,తిమ్మాయిపల్లి గ్రామస్తులు హెచ్చరించారు.