దున్నపోతు కు వినతి పత్రంతో నిరసన

నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ  గ్రామపంచాయతీ కార్మికులు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం సమస్య లతో కూడిన వినతి పత్రాన్ని దున్నపోతు కు  అందచేసి నిరసన తెలిపారు. జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 16 వ రోజుకు చేరిందని అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది అని అన్నారు. గ్రామపంచాయతీ  కార్మికులందరూ తమ హక్కులను సాధించుకునేందుకు పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జె.ఎ.సీ కార్మికులు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.