చేతులకు బేడీలతో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నిరసన ..

Protest to protect the constitution with hand beedis..నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో సోమవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చేతులకు బేడీలు వేసుకుని భరతమాత చిత్రపటాన్ని చేబుని భారత రాజ్యాంగాన్ని కాపాడండి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంబేద్కర్ అవమానపరిచిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ అంటూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడిన మంత్రి అమిత్ షాను బేసిరతుగా మంత్రివర్గం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. భారత జాతికి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని అన్నారు. నిరంతరం ప్రజా పోరాటాల ద్వారా కేంద్రం చేస్తున్న కుట్ర ప్రజల్లోకి తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల చిట్టిబాబు  మండల కమిటీ సభ్యులు ముమ్మడి ఉపేంద్ర చారి, అంబాల మురళి, ఎస్ డి అంజద్, సామ చంద్రారెడ్డి, క్యాతం సూర్యనారాయణ, గుండు రామస్వామి, గుండు లేనిన్,  కాప కోటేశ్వరరావు, కడారి నాగరాజు, మంచోజు బ్రహ్మచారి, గొర్ల శ్రీనివాస్ ,అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కారం రజిత, జిల్లా ఉపాధ్యక్షురాలు మంచాల కవిత, శ్రీరామోజు సువర్ణ, పిట్టల అరుణ్ ,సిరిపల్లి జీవన్ ,కందుల శ్రావణ్, చిన్న పెళ్లి అశోక్, గరుగు ఐలయ్య,   గరుగు వెంకటలక్ష్మి ,సంఘం రామస్వామి, చల్ల పాండురంగ తదితరులు పాల్గొన్నారు.