బేబీతో మరోమారు రుజువైంది

బేబీతో మరోమారు రుజువైందిఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఎస్‌ కేఎన్‌ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్‌ రూపొందించిన చిత్రం ‘బేబి’. తాజాగా జరిగిన ఫిల్మ్‌ ఫేర్‌ సౌత్‌ 2024 అవార్డ్స్‌లో ఈ సినిమాకు 5 అవార్డ్స్‌ దక్కాయి. డైరెక్టర్లు సాయి రాజేశ్‌, డైరెక్టర్‌ మారుతి, నిర్మాత ఎస్‌ కేఎన్‌ మాట్లాడుతూ, ‘అవార్డ్స్‌ అంటే స్టార్స్‌ సినిమాలకే వస్తాయనే అపోహ తొలగి పోయిన సందర్భం ఇది. కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమాలకూ అవార్డులొస్తాయని మా ‘బేబీ’తో మరోమారు రుజువైందిరి’ అని అన్నారు.