మరోసారి నిరూపించారు

మరోసారి నిరూపించారునార్నే నితిన్‌, నయన్‌ సారికలు హీరో హీరోయిన్లు జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వచ్చిన చిత్రం ‘ఆరు’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈనెల 15న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న తరుణంలో చిత్రయూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘110 స్క్రీన్‌లతో మొదలై.. 382 స్క్రీన్‌లకు వెళ్లింది. యూఎస్‌లో 27 స్క్రీన్లతో మొదలై 86 వరకు వెళ్లింది. మంచి కంటెంట్‌తో సినిమా వస్తే.. మౌత్‌ టాక్‌ బాగుంటే.. సినిమా ఏ రేంజ్‌ వరకు వెళ్తుందో, ఆడియెన్స్‌ ఎంతగా ఆదరిస్తారో ఈ సినిమా నిరూపించింది. 11 కోట్ల గ్రా్‌కి పైగా కలెక్ట్‌ చేసింది. ఇప్పటికీ 60, 70 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్‌ నుంచి వచ్చే సినిమాలను జనాలు ఆదరిస్తుంటారు. ఇలాంటి అద్భుతమైన సినిమా చేసిన దర్శకుడు అంజి మా బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తున్నారు’ అని తెలిపారు.