గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించండి

Provide bus facility to the villageనవతెలంగాణ – రామారెడ్డి
 గత పది రోజుల నుండి మండలంలోని గొల్లపల్లి, కన్నాపూర్ గ్రామాలకు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాజీ సర్పంచులు పాల లావణ్య మల్లేష్, రాజ నర్సులు మాజీ ఎమ్మెల్యే సురేందర్ దృష్టికి తీసుకెళ్లడంతో చరవాణిలో డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించాలని సూచించడంతో పాటు, సర్పంచులు వినతి పత్రం అందజేశారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.