డిచ్ పల్లి మండలం లోని ఖిల్లా డిచ్ పల్లి గ్రామానికి చెందిన చాకలి చీకటి మల్లవ్వ గత నెల 24న అనారోగ్య బారిన పడి మృతి చెందింది. అంతకు ముందు రేండేళ్ళ క్రితం ఆమె భర్త లింబాద్రి అనారోగ్యం తో మృతి చెందారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు వివాహమైంది. ముడవ కూతురు వివాహమై ఖానాపూర్ గ్రామానికి చెందిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు.దురదృష్టవశాత్తు ఆయన కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఈ పేద కుటుంబానికి అభిలాష చిన్న కూతురు, ఈ అమ్మాయికి ఒక కూతురు ఇంట్లోనే ఉంటుందనే విషయం తెలుసుకున్న గల్ఫ్ దేశానికి వెళ్లిన ఖిల్లా డిచ్పల్లి యువకులు , గ్రామంలో ఉండే మరికొందరు పెద్దలు కలిసి ఈ పేద కుటుంబాన్ని మానవత దృక్పథంతో అదుకోవడానికి గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికులు సంఘం తరఫున 22వేల 600, గ్రామంలోని మరి కొందరు పెద్దలు యువకులు రూ.5500 మొత్తం రూ.28 వేల ఒక వంద రూపాయలు అభిలాషకు ఆర్థిక సహాయంగా శనివారం అందజేశారు. తమ గ్రామానికి చెందిన పేద ప్రజలకు ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి ఆపన్నాహస్తం అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈస్ఫూర్తిని ప్రతి గ్రామ గల్ఫ్ కార్మికులు ,స్థానికంగా ఉండే ధనికులు వ్యాపారులు పేద కుటుంబాలని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం తరఫున అనారోగ్యంతో మృతి చెందిన లింబన్న, మల్లవ్వల కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకోవాలని ప్రజా ప్రతినిధులను, అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జే మురళి, జే శ్రావణ్ కుమార్, చీకటి రమేష్, మల్లేష్ యాదవ్, మేకల చిన్న లింబాద్రి, ఆకుతోట రూపేష్, గల్ఫ్ దేశం నుండి డబ్బులు పంపిన వారిలో సంఘ ప్రతినిధులు మధ్యప్రసాద్ , తులసి దాస్, జె అశోక్, చాకలి భూమయ్య, గల్ఫ్ కార్మిక సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.