
ఇటీవల మండల పరిధిలోని దిర్శనపల్లి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ గంట పెంటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మృతుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించి మృతుని కుటుంబ సభ్యులకు గ్రామస్తులు రూ.16 వేల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాండవుల లింగయ్య గంట నాగయ్య,రాచకొండ అయోధ్య, గంట రామకృష్ణ అశోక్ పిల్లలమర్రి, మేడి హరికృష్ణ,గంట వీరయ్య ,సోమలింగయ్య తదితరులు పాల్గొన్నారు.