బాధితునికి అర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత కొన్ని రోజుల క్రితం ఇందల్ వాయి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందిన కుమ్మరి రాజేష్ కుటుంబానికి గ్రామ యువతతో పాటు గల్ఫ్ లో ఉన్న సోదరులందరు ఫోన్ పే, గ్రామంలో యువకులు ద్వారా వచ్చిన  రూ.61 వేల 500 రూపాయలను శనివారం కుటుంబ సభ్యులకు అందజేసి మనోధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ వెన్నంటే ఉంటామని, ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని వారన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, సోసైటి చైర్మన్ చింతల పల్లి గోవర్ధన్ రెడ్డి, ముదిరాజ్ నాయకులు లోకాని గంగారాం, లోకాని గోపి తోపాటు
తదితరులు పాల్గొన్నారు.