జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతుకుల గూడెం గ్రామానికి చెందిన నిమ్మ కుమార్ ఇటీవల అనారోగ్య కారణంతో మరణించాడు. మంగళవారం పట్టణంలోని బాలాజీ సిమెంట్ బ్రిక్స్ యజమాని పొనగంటి ప్రభాకర్ ఆధ్వర్యంలో చిన్ననాటి మిత్రులు కలిసి, నిమ్మ కుమార్ కుటుంబానికి తమ వంతు సహాయంగా రూ.25000 ఇరువై వేల రూపాయలు, ఆ కుటుంబానికి తమ వంతు సహాయం గా అందజేశారు. మిత్ర బృందం అందరు కలిసి ఎల్లవేళల ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.