మృతుని కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన చిల్లరగంగయ్య మృతి చెందగా ఆదివారం సర్పంచ్‌ అండెం రజితరాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ కడమంచి వస్తాద్‌, కర్నె జ్యోతివీరేశంతో పాటు పలువురు నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలేసి నివాళులర్పించారు.సర్పంచ్‌ అండెం రజితరాజిరెడ్డి రూ.5వేలు, కర్నె జ్యోతివీరేశం రూ.5 వేలు, మాజీ సర్పంచ్‌ వస్తాద్‌ రూ.3 వేల ఆర్థికసాయాన్ని కుటుంబసభ్యులకు అందజేసి సంతాపం తెలిపారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఎం.ధనమ్మమల్లయ్య, మాజీ ఉపసర్పంచ్‌ కె.లింగయ్య, వార్డు సభ్యులు బి.మల్లయ్య, జె.లింగయ్య, సీహెచ్‌.పర్వతాలు, ఎన్‌.నరేందర్‌, బి.అవిలయ్య, మహేష్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.