
నవతెలంగాణ – కామారెడ్డి
మధ్యాహ్న భోజన పోటీల్లో వండినట్లు వంటలను పాఠశాలల్లో వండి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం జిల్లాస్థాయి మధ్యాహ్న భోజన పోటీలను జిల్లా స్థాయిలో మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించరు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. దీనిలో ప్రథమ బహుమతి గాంధారి మండలనికి, ద్వితీయ బహుమతి బిక్నూర్ మండలనికి, తృతీయ బహుమతి మాచారెడ్డి మండలం వాళ్లు అన్నారు. ప్రథమ బహుమతి 1500 వందల రూపాయలు, ద్వితీయ బహుమతి1000 రూపాయలు, తృతీయ బహుమతి 500 రూపాయలు గెలుపొందగా ఈ బహుమతులను జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదుగా అందించరు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్ కృష్ణ చైతన్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగా కిషన్, ఎన్జీవో ప్రతినిధి రవి, ఉపాధ్యాయులు భవాని, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.