మైనారిటి గురుకుల విద్యార్దులకు యూనిఫాం అందించండి

Provide uniform to students of minority teachers– మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి. యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 
కొత్తగూడెం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాంలు తక్షణమే అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండి.యాకూబ్ పాషా  ప్రభుత్వాన్ని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 1న కళాశాలలు, జూన్ 12న పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా,  నేటి వరకు విద్యార్థులకు మైనారిటీ గురుకుల సంస్థ వారు యూనిఫాంలను అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 204 మైనారిటి గురుకుల పాఠశాలలు, 204 మైనారిటీ గురుకుల కళాశాలలో సుమారు 1,25,218 మంది విద్యార్దులు ప్రవేశం పొందారని, వీరందరూ యూనిఫాంల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, యూనిఫాంల పంపిణీలో జాప్యం వల్ల విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం, అసమానతలు ఏర్పడుతున్నాయని, విద్యార్దులలో సమానత్వం, క్రమ శిక్షణని పెంపొందించటంలో యూనిఫాంలు కీలక పాత్ర పోషిస్తాయని, అటువంటి యూనిఫాం అందకపోవటంతో విద్యార్థులలో మనోధైర్యం దెబ్బతినటమే కాకుండా, విభజన కూడా కనిపిస్తుందని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా  గల గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్దులకు యూనిఫాం లు అందించి వారిలోని  వేరుబాటు తనాన్ని రూపుమాపాలని కోరారు.