
నవతెలంగాణ – జుక్కల్
జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాదీ హమీ కూలీ పనులు కల్పించాలని జుక్కల్ ఎంపిడీవో శ్రీనివాస్ పేర్కోన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతి కార్యదర్శులు, ఉపాదీ హమీ సిబ్బంది తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎంపిడివో, ఏపీవో తులసీరామ్, ఈసీ స్వామీ దాస్ మాట్లాడుతు ముఖ్యంగా గ్రామాలలో త్రాగు నీటీ సమస్యలను గుర్తించాలని అన్నారు, డ్యామేజ్ అయిన పైప్ లను మరమ్మత్తులు చేయించాలని, వాటిని వెంటనే మరమ్మత్తులు చేయించాలని, నీటీ ఎద్దడి తలెత్తకుండా సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలని, ప్రజల నుండి పిర్యాదులు రావద్దని సూచించారు. ఉపాదీహమీ పథకంలో జాబ్ కార్డులు యాక్టివ్ గా ఉన్న వారికి తప్పక ఉపాదీహమీ పథకంలో కూలీ పనులను కల్పించాలని, కూలీపనులకు రాని వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పించి పనులకు వచ్చెవిధంగా చేయాలని, పనులను ఉదయం ఆరు గంటలకు ప్రారంబించుకోవాలని, ఎండతీవ్రత అధికంగా ఉందని, దృష్టిలో పెట్టుకోవాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో తులసిరామ్, ఈసీ స్వామీ దాస్, ముప్పై జీపీలకు సంభందించిన జీపీ కార్యదర్శులు, టీఏలు, ఎఫ్ఏలు తదితరులు పాల్గోన్నారు.