వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేత

Provides financial assistance for medical expensesనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన పాస్తా రాజు కు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొంతకాలంగా రాజు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల కోసం పడుతున్న ఇబ్బందులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన పాస్తా రాజు వైద్య ఖర్చుల కోసం రూ.5వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. అట్టి ఆర్థిక సహాయం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధితుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందించి పరామర్శించారు. ఇకముందు కూడా అండగా ఉంటామని రాజుకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ముల రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి విజయ్ కుమార్, ఎనేడ్ల గంగారెడ్డి, పత్రి రవి, తక్కురి రాజశేఖర్, శేఖర్, రాజారెడ్డి, నరేంధర్, మారుపాక నరేష్, తదితరులు పాల్గొన్నారు.