మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

 నవ తెలంగాణ- రాజంపేట్: మండలంలోని తలమడ్ల  గ్రామానికి చెందిన మేరే రాములు ఆరోగ్యం క్షీణించి  అకాల మరణం చెందడంతో  వారి కుటుంబ అవసరాల నిమిత్తం శుక్రవారం గంప గోవర్ధన్  పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని  బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బిక్కాజి బలవంతరావు చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా బలవంతరావు  మాట్లాడుతూ.. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు గంప గోవర్ధన్ ఆపన్న హస్తంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాజు, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు  నమూన్ల రాజలింగం  సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.