
మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన కొమ్ము పాపయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఆయన కుటుంబానికి ఆసరాగా షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా రూ.5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకులు అంకం కృష్ణారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్కాజి రాజు, శ్రీకాంత్, చాకలి బాలయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గోన్నారు.