నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతుకుల గూడెం గ్రామానికి చెందిన నిమ్మ కుమార్ ఇటీవల అనారోగ్య కారణంతో మరణించాడు. శనివారం మృతుని కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన జమ్మికుంట సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షులు కడెం జనార్ధన్ తన వంతుగా 5000 రూపాయలు సహాయము అందజేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.