
బొమ్మలరామారం మండలంలోని లక్ష్మీ తండా గ్రామపంచాయతీ గల దేవుని తండా, బుక్య తండాలో సోమవారం 30 ఎల్ఈడి లైట్లును ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సహకారంతో తండాలో లైట్లు అందజేయడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షుడు సింగర్తి మల్లేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్, మండల పార్టీ ఎస్టి అధ్యక్షులు నరసింహ, గ్రామ శాఖ బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.